News June 30, 2024
టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కోహ్లీ సైతం టీ20Iలకు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించారు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. వరల్ట్ కప్ గెలవకపోయినా రిటైర్మెంట్ ప్రకటించే వాడినని వ్యాఖ్యానించారు.
Similar News
News November 15, 2025
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాహుల్ అభినందన

తెలంగాణ సీఎం రేవంత్, PCC చీఫ్ మహేశ్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించినందుకు రాహుల్ వారిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు.
News November 15, 2025
స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశా: రానా

TG: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానాను CID సిట్ విచారించింది. తన బ్యాంకు వివరాలను అధికారులకు రానా అందించారు. స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిట్కు తెలిపినట్లు రానా పేర్కొన్నారు. అన్నీ పరిశీలించాకే బెట్టింగ్ యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు.
News November 15, 2025
శాశ్వతమైన ఆనందానికి మార్గం ఏదంటే..?

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ ||
ఆరంభం, అంతం లేనివాడు, సకల లోకాలకు మహేశ్వరుడు, సమస్త ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువును నిత్యం స్తుతించి, ధ్యానించే భక్తుడు సమస్త దుఃఖాలను దాటి మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుడిని నిరంతరం స్మరించడమే మనకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని ప్రసాదించే దివ్య మార్గం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


