News October 24, 2024

గుడ్‌న్యూస్: తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇటీవల భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్ ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.600, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.550 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,470కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.72,850గా నమోదైంది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2000 తగ్గి, రూ.1,10,000కు లభిస్తోంది.

Similar News

News December 31, 2025

వారికి 16సార్లు న్యూ ఇయర్

image

అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు 16సార్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. గంటకు 28వేల కి.మీ. వేగంతో భూమి చుట్టూ తిరిగే ISS 90 నిమిషాల్లో ఎర్త్‌ని చుట్టేస్తుంది. అంటే రోజులో 16సార్లు భూమి చుట్టూ తిరుగుతూ 45 నిమిషాలకు ఓ పగలు, మరో 45ని.లకు రాత్రిని చూస్తారు. అలా న్యూ ఇయర్‌కూ వీరు 16సార్లు వెల్కమ్ చెబుతారన్నమాట. ప్రస్తుతం ISSలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.

News December 31, 2025

క్రికెట్.. 2025లో టాప్-5 ‘ఫస్ట్’ ఈవెంట్స్

image

☛ భారత మహిళల జట్టు ‘ఫస్ట్’ టైమ్ ODI WC గెలిచింది
☛ మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ‘ఫస్ట్’ టీమ్‌గా IND మెన్స్ టీమ్ రికార్డు
☛ RCB ‘ఫస్ట్’ టైమ్ IPL టైటిల్ గెలిచింది
☛ టెస్ట్ క్రికెట్‌లో ‘ఫస్ట్’ టైమ్ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు (వెస్టిండీస్) డకౌట్ అయ్యారు. ఇందులో స్టార్క్(AUS) 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీశారు.
☛ సౌతాఫ్రికాకు ఫస్ట్ ‘WTC’ టైటిల్ విజయం

News December 31, 2025

Ohh.. అప్పుడే క్వార్టర్ అయిపోయింది!

image

ఇది ఈ శతాబ్దంలో నేటితో ముగుస్తున్న క్వార్టర్ టైమ్ గురించి. 2001తో మొదలైన 21వ శతాబ్దంలో ఇవాళ్టితో పావు వంతు పూర్తయింది. మిలీనియం మొదట్లో చదువుకుంటున్న లేదా అప్పుడే నడక మొదలుపెట్టిన మనలో చాలామంది ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే.. ఈ ఇయర్ మాత్రమే కాదు 25 ఏళ్లు ఎంత ఫాస్ట్‌గా అయిపోయాయి అనిపిస్తుంది. ఇన్నేళ్ల జ్ఞాపకాలతో మరో కొత్త ఇయర్‌లోకి కొత్త ఆశలు, ఆశయాలతో అడుగుపెడదాం. Happy New Year.