News April 19, 2024

సార్వత్రిక ఎన్నికల కోసం గూగుల్.. డూడుల్

image

ఈరోజు నుంచి ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలకు గుర్తుగా గూగుల్ హోం పేజీలో డూడుల్‌ను అప్‌డేట్ చేసింది. GOOGLEలో రెండో ‘O’ స్థానంలో చూపుడు వేలుపై ఇంకు చుక్క ఉన్న బొమ్మను పెట్టింది. దీనిపై క్లిక్ చేస్తే ఎన్నికల సమాచారం వస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ ఇలా డూడుల్‌ను ఏర్పాటు చేస్తుందన్న సంగతి తెలిసిందే. సాధారణంగా డూడుల్ రూపకర్తల పేరును కూడా ఇచ్చే సంస్థ, ఈసారి ఎవరి పేరునూ చెప్పకపోవడం గమనార్హం.

Similar News

News December 16, 2025

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

image

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.

News December 16, 2025

NIPERలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్ (NIPER) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. BE, బీటెక్, B.COM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://niperahmnt.samarth.edu.in