News April 10, 2025

పనిచేయకున్నా జీతం ఇస్తోన్న గూగుల్.. ఎందుకంటే?

image

తమ కంపెనీలోని టాలెంటెడ్ ఉద్యోగులను ప్రత్యర్థులు లాగేసుకోకుండా ఉండేందుకు గూగుల్ కాస్త తెలివిగా ఆలోచించింది. మార్కెట్‌లో Aiలో పోటీతత్వం పెరగడంతో ‘Google DeepMind’ అంటూ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంటోంది. దీనిపై సంతకాలు చేసిన వారికి ఏడాది వరకైనా పని చేయకపోయినా కంపెనీ జీతం ఇస్తుంటుంది. ఈ నిర్ణయం వీరు ఇతర కంపెనీలకు వెళ్లకుండా చేస్తుంది. అయితే దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 18, 2025

నీళ్లు తరలించకుండా చూడండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

image

TG: కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జులై వరకూ తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి 16.20TMCల నీరు కావాలని బోర్డుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జున‌సాగర్ జలాశయాల కింద రాష్ట్రానికి తాగు, సాగు నీటి అవసరాలకు 29.79 TMCల నీరు రావాల్సి ఉందంది. ఇప్పటికే కేటాయించిన వాటా కంటే అదనంగా AP వినియోగించుకుందని, ఇకపై నీటిని తరలించకుండా చూడాలని నీటి పారుదల ENC కృష్ణా బోర్డును కోరారు.

News April 18, 2025

భూ భారతి.. కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 14 నుంచి వచ్చిన కొత్త అప్లికేషన్లను భూ భారతి చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించింది. అప్లికేషన్లను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపింది. దరఖాస్తుదారులు చూపించిన ఆధారాల ప్రకారం సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

News April 18, 2025

ముంబై అదిరిపోయే గేమ్ ప్లాన్.. ఫ్యాన్స్ ఖుషీ

image

SRHపై నిన్న MI చక్కటి గేమ్ ప్లాన్ అమలు చేసి గెలిచిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పరుగుల వరద పారే వాంఖడేలో బౌలర్లు యార్కర్లు, స్టంప్స్‌ను అటాక్ చేస్తూ, స్లో బాల్స్ వేశారని అంటున్నారు. ఆపై కెప్టెన్ హార్దిక్ బౌలర్లను బాగా రొటేట్ చేశారని, దీంతో SRH తక్కువ స్కోరుకే పరిమితమైందని SMలో పోస్టులు పెడుతున్నారు. చాహర్, హార్దిక్ 40+ రన్స్ ఇవ్వడం మినహా మ్యాచ్‌ను MI వన్ సైడ్ చేసిందని చెబుతున్నారు.

error: Content is protected !!