News October 3, 2024
తెలుగువారి కోసం Google కొత్త ఫీచర్

Gemini Live AI టూల్‌తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడకం పెరుగుతుండడంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
Similar News
News March 3, 2025
కల్తీ నెయ్యి కేసు నిందితులకు మరోసారి కస్టడీ

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
News March 3, 2025
కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు: గవాస్కర్

విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌కూ మెరుగవ్వాలని చూస్తుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘సాధించిన దాని గురించి కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు. భారత్‌కు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు. రికార్డుల్ని మాత్రమే కాదు. మైదానంలో ఆయన నిబద్ధత చూడండి. జట్టు కోసం ఏం చేయాలన్నా చేస్తారు. అందుకే భారత క్రికెట్ అనే విద్యాలయంలో విద్యార్థి స్థాయి నుంచి ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు’ అని ప్రశంసించారు.
News March 3, 2025
మనసు ‘దోశే’సిన వంటకం!

తెలుగువారికి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.