News December 11, 2024
GOOGLE: ప్రపంచంలో రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా GOOGLE అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.
Similar News
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

భారత్కు ప్రతి టెస్టు కీలకమే

WTC 2025-27 సీజన్లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.