News October 9, 2025
గూగుల్ సబ్సిడరీ కంపెనీ రూ.87 వేల కోట్ల పెట్టుబడులు

AP: ఆసియాలోనే అతి పెద్ద డేటా క్లస్టర్‌ను గూగుల్ సబ్సిడరీ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ఏకంగా రూ.87,520 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం కూడా లభించింది. దేశంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ సంస్థ 3 క్యాంపస్లు ఏర్పాటు చేయనుంది.
Similar News
News October 9, 2025
మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. భక్తి, జాబ్స్, పాడిపంట, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <
News October 9, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. MPTC, జడ్పీటీసీ తొలి దశ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి దశలో 292 ZPTC, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. కొన్ని చోట్ల నామినేషన్ల స్వీకరణ మొదలైంది.
News October 9, 2025
సెలక్షన్ నా చేతుల్లో ఉండదు: షమీ

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు. ‘సెలక్షన్ అనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ల నిర్ణయం. నేను జట్టులో ఉండాలనుకుంటే సెలక్ట్ చేస్తారు. లేదంటే లేదు. నేను ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాను. దులీప్ ట్రోఫీలో 35 ఓవర్లు వేశాను’ అని చెప్పారు. కెప్టెన్సీ మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని, గిల్‌కు అనుభవం ఉందని తెలిపారు.