News May 9, 2024
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’ పేరుతో గూగుల్ ఓ డిజిటల్ వాలెట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో మీ పేమెంట్ కార్డులు, టికెట్లు, ఐడీలు మొదలైనవి భద్రపరుచుకోవచ్చు. అయితే ఇందులో గూగుల్ పే తరహాలో చెల్లింపులు చేసే సదుపాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా హైదరాబాద్, కొచ్చి మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Similar News
News January 23, 2026
తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ

తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త సర్కార్ లోడింగ్ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో డీఎంకేకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు. DMK ప్రభుత్వం CMC (కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కారుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. వికసిత్ భారత్ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకమని చెన్నైలో నిర్వహించిన సభలో మోదీ స్పష్టం చేశారు.
News January 23, 2026
UCILలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 23, 2026
వీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు

బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. రోజులో 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటలు ఆహారాన్ని తీసుకుంటారు. దీన్ని సరిగ్గా పాటించకపోతే హైపోగ్లైసీమియా, హైపర్‌గ్లైసీమియాకి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని పాటించడం సరికాదంటున్నారు.


