News January 25, 2025
గూగుల్ రాక రాష్ట్రానికి గేమ్ ఛేంజర్: CBN

AP: దావోస్‌లో ఎన్ని MoUలు చేసుకున్నారంటూ వస్తున్న ప్రశ్నలపై CM చంద్రబాబు వివరణ ఇచ్చారు. ‘రామాయపట్నంలో రూ.95వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, LG కంపెనీ రూ.5వేల కోట్లు, రూ.65వేల కోట్లతో రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్ రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో పాటు గూగుల్ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్. విశాఖలో ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి’ అని తెలిపారు.
Similar News
News October 23, 2025
తేలని ‘స్థానిక’ అంశం!

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News October 23, 2025
HYDలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్

TG: USకు చెందిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. HYDను ఎంచుకోవడాన్ని CM స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్రాన్ని 2047నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ఆయన వారికి వివరించారు.
News October 23, 2025
బంగ్లాదేశ్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ

AP: విజయనగరం(D)కి చెందిన 8మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళానికి పట్టుబడడం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి విడుదలపై ఏపీ ప్రభుత్వం బంగ్లాదేశ్ GOVTకి లేఖ రాసింది. వారిని క్షేమంగా వెనక్కు రప్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళన వద్దని ఆ కుటుంబాలకు సూచించారు.