News December 9, 2024

టీచర్ ఎమ్మెల్సీగా గోపీ మూర్తి విజయం

image

AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్‌లో PDF అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. గోపీ మూర్తికి 8వేలకు పైగా ఓట్లు లభించాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 15,490 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదుగురు అభ్యర్థులు గోపీమూర్తి, నారాయణరావు, దీపక్, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీ పడ్డారు.

Similar News

News September 16, 2025

రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

image

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.

News September 16, 2025

‘షేక్‌ హ్యాండ్’ వివాదంలో పాక్‌కు మరో ఎదురుదెబ్బ!

image

ఆసియా కప్: పాక్ ప్లేయర్లకు సూర్య స్క్వాడ్ షేక్‌ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అది నిబంధనలకు విరుద్ధమని ICCకి PCB ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేకపోతే UAEతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. పాక్ బెదిరింపులను ICC తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ‘అందులో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్‌లో లేదు’ అని ICC తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

News September 16, 2025

హాస్టళ్ల నిర్మాణం-మరమ్మతులకు నిధులు: CBN

image

AP: SC, ST, BC హాస్టళ్లలో వసతులు మెరుగవ్వాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద రుణం వస్తుంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. SC, ST హాస్టళ్లలో చదివే విద్యార్థులు IIT, IIM వంటి సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి’ అని తెలిపారు.