News March 10, 2025
గోపీచంద్-సంకల్ప్ రెడ్డి కాంబోలో కొత్త మూవీ

టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమాపై అప్డేట్ వచ్చింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో ‘Gopichand33’ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా, గతేడాది రిలీజైన గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన ‘విశ్వం’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సంకల్ప్ రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం సినిమాలను తెరకెక్కించారు.
Similar News
News March 10, 2025
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: KTR

TG: ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.
News March 10, 2025
చంద్రయ్య హత్య కేసు CIDకి అప్పగింత

AP: పల్నాడుకు చెందిన TDP కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసు దస్త్రాన్ని వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2022లో వెల్దుర్తి (M) గుండ్లపాడులో ప్రత్యర్థులు చంద్రయ్యను గొంతు కోసి చంపారు. హత్యకు ముందు జై జగన్ అనాలని నిందితులు చంద్రయ్యను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కేసు రీఓపెన్ చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం తాజాగా CIDకి అప్పగించింది.
News March 10, 2025
ఎన్టీఆర్-నెల్సన్ సినిమా టైటిల్ అదేనా?

తమిళ డైరెక్టర్ నెల్సన్‌తో Jr.NTR ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.