News September 9, 2025
జూబ్లీహిల్స్ బరిలో గోపీనాథ్ సతీమణి?

TG: మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. BRS సెంటిమెంట్‌గా గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మాగంటి సునీత గోపీనాథ్ పేరిట నిత్యం పోస్టులు చేస్తున్నారు. మరోవైపు తన ఇద్దరు కూతుళ్లు అక్షర, దిశిరను జనాల్లోకి పంపుతున్నారు. వారు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ మమేకమవుతున్నారు.
Similar News
News September 9, 2025
Way2News కాన్‌క్లేవ్: వైసీపీ నుంచి బుగ్గన, సజ్జల

AP: విజయవాడ CK కన్వెన్షన్‌లో ఈనెల 12న <<17649043>>Way2News కాన్‌క్లేవ్<<>> జరగనుంది. ఈ సదస్సుకు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే పదేళ్లకు గాను తమ ఆలోచనలు పంచుకోనున్నారు. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న తొలి కాన్‌క్లేవ్ ఇదే.
News September 9, 2025
INSPIRING: ట్రాన్స్‌జెండర్ నుంచి ఫొటో జర్నలిస్టు!

రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ట్రాన్స్‌జెండర్ జోయా థామస్ లోబో జీవితాన్ని పేపర్‌లో వచ్చిన ఫొటోగ్రాఫర్ కథనం మార్చేసింది. తానూ ఫొటోగ్రాఫర్ అవ్వాలని ఓ కెమెరా కొని దానితో ట్రాన్స్‌ల జీవితాలపై డాక్యుమెంటరీ చేశారు. ఓ మూవీలోని హిజ్రా పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరలవడంతో ఓ వార్తాసంస్థ రిపోర్టర్ ఉద్యోగం ఇచ్చింది. లాక్డౌన్‌లో వలస కార్మికుల కష్టాలను కళ్లకు కట్టేలా తీసి ఫొటో జర్నలిస్టుగా మారారు.
News September 9, 2025
2035లో ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’: ఇస్రో ఛైర్మన్

ఇస్రో భవిష్యత్ కార్యాచరణ గురించి ఛైర్మన్ వి.నారాయణన్ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం ఉన్న వాటి కంటే 3 రెట్లు అధికంగా శాటిలైట్స్‌ను కక్ష్యల్లో ప్రవేశపెడతాం. చంద్రయాన్-4, 5 మిషన్స్‌పై దృష్టిపెట్టాం. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ స్థాపిస్తాం. 2028లో ఫస్ట్ మాడ్యూల్ పంపిస్తాం. 2040లో ఇండియా చంద్రుడిపై అడుగు పెడుతుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతాం’’ అని మీడియాకు తెలిపారు.