News October 28, 2024

GOSSIP: నానీతో లోకేశ్ కనగరాజ్ సినిమా?

image

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో టాలీవుడ్ హీరో నాని ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ గాసిప్ నడుస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన లోకేశ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే.. ఇది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో ఒకటిగా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News

News January 30, 2026

NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>NCERT<<>>లో 173 గ్రూప్ A, B, C నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 2వరకు పొడిగించారు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News January 30, 2026

టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

image

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.

News January 30, 2026

కెనడా విమానాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్‌

image

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్‌లు వేస్తానని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ గల్ఫ్‌స్ట్రీమ్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా బొంబార్డియర్ సహా కెనడియన్ విమానాల సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల <<18949938>>కెనడాపై<<>> 100% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు.