News February 20, 2025
టమాటా ధరల పతనంపై ప్రభుత్వం చర్యలు

AP: రాష్ట్రంలో <<15523622>>టమాటా<<>> ధరల పతనంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. టమాటాలను మార్కెటింగ్ శాఖ ద్వారా రేపటి నుంచి కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వాటిని రైతు బజార్లలో విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేయాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి భరోసా కల్పించారు.
Similar News
News December 6, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు అప్లై చేశారా?

ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 యాక్చురియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40వేలు స్టైపెండ్ చెల్లిస్తారు.
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.


