News November 21, 2024
‘ఫుడ్ పాయిజన్’ ఘటనపై ప్రభుత్వం చర్యలు
TG: నారాయణపేట జిల్లా మాగనూర్ ZP స్కూల్లో <<14664383>>ఫుడ్ పాయిజన్<<>> ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా, తాజాగా డీఈవో అబ్దుల్ ఘనీపై వేటు వేసింది. అలాగే అక్కడికి భోజనం సరఫరా చేసిన ఏజెన్సీని రద్దు చేసింది. ఆర్డీవో, ఎంపీడీవో, ఫుడ్ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై అడిషనల్ కలెక్టర్ సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 21, 2024
అదానీపై అమెరికాలో కేసు ఎందుకు?
అదానీ ఇండియాలోని ప్రభుత్వాలకు, డిస్కంలకు లంచం ఇచ్చారని USలో కేసు నమోదవడం ఏంటి? వారెంట్ జారీ చేయడమేంటి? అనుకుంటున్నారా? తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టారనేది అదానీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినీతి మార్గంలో ప్రాజెక్టులు చేపట్టి, వాటిల్లో తమ దేశ పౌరులతో ఇన్వెస్ట్ చేయించుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. ఇలా చేయడం ఆ దేశంలో చట్టవిరుద్ధం. అందుకే అక్కడ కేసు పెట్టారు.
News November 21, 2024
విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా సంస్కరణలు: మంత్రి లోకేశ్
AP: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలుచేయాలని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. ‘GOVT స్కూళ్లలో అడ్మిషన్లను పెంచడం, టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు యాప్‌ను తీసుకొస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను APతో పంచుకోవాలని WB ప్రతినిధులను కోరా’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2024
ఈ సముద్రాలు కాంతులీనుతాయి!
రాత్రి వేళ సముద్రతీరాన ఉండే అనుభూతే వేరుగా ఉంటుంది. మరి సముద్రం నీలికాంతులతో ధగధగలాడుతుంటే ఇంకెంత అందంగా ఉంటుంది? భూమిపైకి స్వర్గమే వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ కాంతుల్ని బయోలుమినిసెన్స్ అంటారు. భారత్‌లో అలాంటి సముద్ర తీరాల్లో కొన్ని.. కేరళలోని మునాంబం బీచ్, అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఒకటైన హావ్లాక్ దీవి, పశ్చిమ బెంగాల్‌లోని తాజ్పూర్ బీచ్, గోవాలోని కేరీ బీచ్, లక్షద్వీప్‌లోని బంగారం దీవి.