News April 25, 2024
కాళేశ్వరం అక్రమాలపై ఫిర్యాదులకు ప్రభుత్వ ప్రకటన

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఫిర్యాదులకు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ సమయంలో ప్రజలు తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో హైదరాబాద్‌లో అందించవచ్చని తెలిపింది. మే 31లోగా ఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో అందించాలని పేర్కొంది. పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చని తెలిపింది.
Similar News
News January 29, 2026
మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

TG: మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నిన్న 40 లక్షల మంది గద్దెలను దర్శించుకున్నారు.
News January 29, 2026
CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<
News January 29, 2026
మొక్కజొన్న కంకిలో గింజలు చివరి వరకూ రావాలంటే?

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.


