News May 26, 2024
గుట్కా, పాన్‌మసాలాపై ప్రభుత్వం నిషేధం

TG: టొబాకో, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్‌మసాలా తయారీ, నిల్వ, సరఫరా, రవాణా, అమ్మకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి ఏడాది పాటు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 14, 2025
హోలి: ఈ జాగ్రత్తలు పాటించండి

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.
News March 14, 2025
స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మల సీతారామన్ ఫైర్

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.
News March 14, 2025
నా కొడుకు తర్వాత సపోర్ట్ చేసేది ఆ హీరోకే: రోహిణి

నటి రోహిణి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొడుకు తర్వాత తాను సపోర్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి హీరో నాని అని ట్వీట్ చేశారు. ‘కోర్టు’తో ప్రేక్షకులకు ఆసక్తికర కథను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు వేయగా మూవీని పలువురు ప్రముఖులు వీక్షించారు. కాగా రోహిణి, నాని కలిసి అలా మొదలైంది, అంటే సుందరానికి, జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో నటించారు.