News January 30, 2025
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై ప్రభుత్వం క్లారిటీ

AP: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను <<15097641>>రద్దు చేస్తారనే<<>> వార్తలపై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆ ఎగ్జామ్స్ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్నల్ మార్క్స్ ఆలోచనను విరమించుకుంది. వివిధ వర్గాల నుంచి స్వీకరించిన సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. NCERT సిలబస్ అమలు చేయనుంది. మ్యాథ్స్‌లో A, B పేపర్లు కాకుండా ఒకే పేపర్‌గా ఇస్తారు. బోటనీ, బయాలజీ కలిపి ఒకే పేపర్ ఉంటుంది.
Similar News
News December 1, 2025
విశాఖ: ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి స్వయం ఉపాధి కోసం మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలసి కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. చిన్నారులతో మాట్లాడి వారి చదువు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/


