News January 13, 2025
6 జిల్లాల్లో వెదురు సాగుకు ప్రభుత్వం నిర్ణయం

TGలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 4 ఏళ్లలో 7లక్షల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 75వేల మంది రైతులకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల్లో వెదురు సాగు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.
Similar News
News December 5, 2025
ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయ్..

మన ఆహార వ్యవస్థలకు పునాది భూమి. అయితే ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, రసాయన పరిశ్రమల వ్యర్థాలు, మిరిమీరిన పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం, లోతు దుక్కులు, తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల, వరదలు, గాలి, తుఫానులతో నేల కోతకు గురవ్వడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి, ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటి కట్టడికి మన వంతు ప్రయత్నం చేసి నేల సారం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
News December 5, 2025
హోమ్ లోన్ EMIపై ఎంత తగ్గుతుందంటే?

RBI రెపో రేటును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ తగ్గింపుతో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయంటున్నారు. ఫలితంగా గృహ, వాహన రుణాలపై నెలవారీ ఈఎంఐలు తగ్గి రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలకు దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
News December 5, 2025
అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయా?

అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడాన్ని హిర్సుటిజం అంటారు. ముందు దీనికి చికిత్స తీసుకుని ఆ తర్వాత వెంట్రుకల పెరుగుదలను ఆపడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. వెంట్రుకలు తొలగించడానికి పర్మనెంట్ హెయిర్ లేజర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. అయితే హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఎక్కువ సెషన్లు తీసుకోవాల్సి వస్తుంది. మూల కారణాన్ని తెలుసుకుంటే సెషన్ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.


