News March 16, 2025
టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News November 23, 2025
HYD: బస్సెందుకు మామా.. బండిపై పోదాం!

సిటీ బస్ ఎందుకు మామా.. బైక్ ఉంది కదా దానిపై పోదాం అని అంటున్నారు పురుషులు. నగరంలో బస్ ఎక్కే పురుషుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకు ఈ గణాంకాలే సాక్ష్యం. సిటీలో రోజూ 2,850 బస్సుల్లో 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 18.5 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉండగా పురుషులు కేవలం 7.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలు చాలు పురుషులు బస్‌లో వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుసుకోవడానికి.
News November 23, 2025
లేటెస్ట్ అప్డేట్స్

✯ తెలంగాణకు వల్లభాయ్ పటేల్ కంటే గొప్పవారు లేరు: కిషన్ రెడ్డి
✯ శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతి
✯ బహ్రెయిన్-హైదరాబాద్ విమానంలో బాంబు లేదని తేల్చిన అధికారులు.. ఉ.11.30 గంటలకు HYD చేరుకున్న విమానం
✯ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్‌కు అన్ని భాషల్లో 100మిలియన్లకు పైగా వ్యూస్: సినీ వర్గాలు
News November 23, 2025
జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


