News March 8, 2025
ప్రభుత్వ ఉద్యోగులూ… జాగ్రత్త

TG: ACB పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ వస్తే నమ్మవద్దని ఏసీబీ సూచించింది. కొందరు వ్యక్తులు అవినీతి కేసులు నమోదు చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఉద్యోగుల్ని బెదిరిస్తున్నట్లు తెలిపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైందని పేర్కొంది. బెదిరింపు కాల్వస్తే వెంటనే 1064కు డయల్ లేదా 9440446106కు వాట్సాప్ చేయవచ్చంది. స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించింది.
Similar News
News November 19, 2025
HYD: వరుసగా ముహుర్తాలు.. మాల్స్ ఫుల్

ఈ నెలలో వచ్చే వారంలో భారీగా ముహూర్తాలు ఉండడంతో బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, కొంపల్లి, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. మాల్స్ వద్ద వస్త్రాల కొనుగోలు జరుగుతుండగా, బంగారు దుకాణాల్లో సైతం జనం పెరుగుతున్నారు. 3 రోజులుగా డిమాండ్ మరింత పెరిగిందని షాపుల యజమానులు చెబుతున్నారు.
News November 19, 2025
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.