News August 27, 2024
మరో డీఎస్సీపై ప్రభుత్వ కసరత్తు!

TG: ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోంది. డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరిస్తోంది.
Similar News
News November 27, 2025
ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు

చొరబాటుదారులు ఆధార్ పొందడంపై CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దేశపౌరులు కానివారికి ఆధార్ ఉంటే ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించింది. ఓటరు జాబితాపై EC చేస్తోన్న SIRను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్. ఇది ఓటు హక్కు, పౌరసత్వం, నివాస స్థలాన్ని ఇవ్వదని చట్టంలో స్పష్టంగా ఉంది’ అని పేర్కొంది.
News November 27, 2025
గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ వంటకాలు

TG: డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు హైదరాబాద్ బిర్యానీ సహా మరికొన్ని తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. డబుల్ కా మీఠా, పత్తర్ కా ఘోష్, తెలంగాణ స్నాక్స్ కూడా మెనూలో ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని హైలైట్ చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని CM రేవంత్ ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 27, 2025
మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్

పది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్ చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో AP, TG, MH, MP, UP, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గతంలో అధికారులకు లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీల్లో జరిగిన తనిఖీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయా యాజమాన్యాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈ ఏడాది జూన్‌లో FIR నమోదైంది.


