News September 3, 2024

వరద నివారణ, సహాయక చర్యల్లో సర్కార్ విఫలం: అంబటి

image

AP: వరద నివారణ, సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో బాధితుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు వరద నివారణ, సహాయక చర్యలను చేపడుతున్నామని టీడీపీ అంటోంది. బాధితులందరికీ సాయం చేస్తున్నామని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దని విమర్శిస్తోంది.

Similar News

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News December 2, 2025

CTETకు దరఖాస్తు చేశారా?

image

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్‌, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/

News December 2, 2025

చర్మ ఆరోగ్యానికి టమాటా

image

ముఖంపై మచ్చలు, మొటిమలు, గుంతలు వంటి సమస్యలకు టమాటా పరిష్కారం చూపుతుందంటున్నారు చర్మ నిపుణులు. * టమాటా రసం, నిమ్మరసం కలిపి, దీంట్లో దూదిని ముంచి ముఖానికి అప్త్లె చేసుకొని మసాజ్ చేసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేస్తే ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. *టమాటా రసంలో శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.