News September 1, 2024

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: వెలంపల్లి

image

AP: విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణిస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని YCP నేత వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘రెండు రోజులుగా విజయవాడలోని పలు కాలనీలు, ఇళ్లు నీటమునిగాయి. బాధితులకు కనీసం భోజనం కూడా అందించటం లేదు. ఎవరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News February 1, 2025

శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్

image

తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.

News February 1, 2025

చంద్రబాబు సిగ్గుపడాలి: అంబటి రాంబాబు

image

AP: బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ కంటే బిహార్ ఎక్కువ సాధించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందులో నితీశ్ కుమార్ విజయాన్ని చూసి CM చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరోవైపు, తమ నలుగురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసాని కార్పొరేటర్ స్థాయికి దిగిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి Dy. మేయర్‌గా పోటీ చేయాలనుకుంటే శేఖర్ రెడ్డి ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు.

News February 1, 2025

క్రికెట్‌కు గుడ్‌బై: సాహా

image

భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 28 ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, క్లబ్, డిస్ట్రిక్ట్, స్టేట్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. IPLలో KKR, SRH, GT, పంజాబ్‌కు ఆడారు. కుటుంబంతో సమయం గడిపేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు Xలో పోస్ట్ పెట్టారు. సాహా 40 టెస్టుల్లో 1,353 పరుగులు, 9 ODIల్లో 41, 122 FC మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.