News December 21, 2024

‘ఉచిత బస్సు‘పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం

image

AP: మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది.

Similar News

News January 23, 2026

మోదీకి మద్దతు ఎందుకు: YS షర్మిల

image

AP: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయడంలోనూ, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలోనూ మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. VB-G RAM G బిల్లులోని 60:40 విధానం వలన ఏపీపై భారం పడుతుందంటూనే మరోవైపు సాయం కోరడంపై ఆగ్రహించారు. తొలుత బిల్లుకు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు మద్దతు కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

News January 23, 2026

మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

image

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.

News January 23, 2026

త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

image

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్‌ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.