News March 30, 2025
కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

AP: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.
Similar News
News April 1, 2025
‘L2: ఎంపురాన్’ సినిమాలో మార్పులు

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా రివైజ్డ్ వెర్షన్‌కు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు 24 కట్స్ సూచించడంతో 2:08min నిడివి తగ్గనుంది. అలాగే సినిమాలో విలన్ పేరును కూడా మార్చారు. రేపటి నుంచి ఈ కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తారు. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసిన సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో మూవీ టీమ్ సినిమాలో మార్పులు చేసింది.
News April 1, 2025
BIG BREAKING: కొత్త రేషన్‌కార్డులపై శుభవార్త

AP: మే నెల నుంచి ATM కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. QR కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమందికి రేషన్‌కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే కొత్త కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.
News April 1, 2025
కాకాణికి చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన హైకోర్టు

AP: వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి ఆయనకు ఉపశమనం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తనపై పోలీసులు <<15956367>>అక్రమ కేసులు<<>> నమోదు చేస్తున్నారని, కేసులు క్వాష్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.