News February 28, 2025
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

TG: విద్యాసంస్థల్లోని 15% కన్వీనర్ కోటా సీట్లన్నీ ఇకపై రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. నాన్-లోకల్ కోటాకు సర్కార్ సవరణలు చేసింది. ఇప్పటి నుంచి 85% తెలంగాణ వారికి, 15% తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి అవకాశం కల్పించనుంది. AP విద్యార్థులు పోటీ పడటానికి వీలుండదు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా తదితర కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
Similar News
News February 28, 2025
హరీశ్ రావుపై మరో కేసు నమోదు

TG: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.
News February 28, 2025
D-Streetలో బ్లడ్‌బాత్: నష్టాల్లో 28ఏళ్ల రికార్డు బ్రేక్

స్టాక్‌మార్కెట్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. సంపద సృష్టిలో కాదు. హరించడంలో! ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నేడు బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ముగియడం ఖాయమే. అంటే నిఫ్టీ వరుసగా 5 నెలలు నష్టాల్లో క్లోజైనట్టు అవుతుంది. 28 ఏళ్ల క్రితం ఇలా జరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 22,118 (-425), సెన్సెక్స్ 73,204 (-1400) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.7L కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సూచీలన్నీ విలవిల్లాడుతున్నాయి.
News February 28, 2025
ఎక్కువ పని గంటలు ప్రాణానికి ముప్పు!

కెరీర్‌లో మరింత రాణించాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అనుకునే వారికి డా. సుధీర్ కుమార్ పలు సూచనలు చేశారు. ‘కెరీర్ గ్రోత్ కోసం రోజుకు 15 గంటలు పని చేయొచ్చా అని ఓ 25 ఏళ్ల ఉద్యోగి అడిగితే ఇలా చేస్తే మీరు రాణించలేరని చెప్పా. తెలివిగా, ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయడం మంచిది. అతిగా పనిచేయడం వల్ల గుండెపోటు, పక్షవాతంతో పాటు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ఒత్తిడితో పాటు నిరాశకు గురవుతారు’ అని ఆయన ట్వీట్ చేశారు.