News February 5, 2025

ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని NTR వైద్యసేవ CEOను ఆదేశించింది. ఇప్పటి వరకు TGలో 11 ఆస్పత్రుల్లోనే NTR వైద్యసేవ ట్రస్టు సేవలు అందుతున్నాయి. దీంతో 2015 తర్వాత ట్రస్టు గుర్తింపులేని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

Similar News

News November 20, 2025

ఈ అలవాట్లతో రోగాలకు దూరం: వైద్యులు

image

ఆరోగ్య సమస్యలను డైలీ హ్యాబిట్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘రోజుకు 10వేల అడుగులు నడిస్తే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి & ఆందోళన తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్ర పోవడం & మేల్కోవడం చేయాలి. సూర్యరశ్మి తగిలితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్‌ను తినకపోవడం బెస్ట్. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి’ అని సూచిస్తున్నారు.

News November 20, 2025

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.

News November 20, 2025

‘జనజీవన స్రవంతి’ అంటే ఏంటంటే?

image

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు అనే వార్తలు వింటుంటాం. ‘జనజీవన స్రవంతి’ అంటే సమాజంలో శాంతియుతంగా, చట్టబద్ధంగా జీవించడం. మావోయిస్టులు హింస, ఆయుధాలు & రహస్య జీవితాన్ని విడిచిపెట్టి, సాధారణ పౌరులుగా మారారని అర్థం. వారు ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విద్య, ఉద్యోగం వంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఇది సూచిస్తుంది.