News November 19, 2024
రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సర్కారు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో రూ.85వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమలకు అనుమతులు, భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డుతో CM చంద్రబాబు సమావేశమై నిర్ణయం తీసుకున్నారని, రీస్టార్ట్ APలో ఇది తొలి అడుగు అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కంపెనీలతో 34వేల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
Similar News
News December 4, 2025
భారతీయుడికి జాక్‌పాట్.. లాటరీలో రూ.61కోట్లు!

సౌదీలో ఉంటున్న భారతీయుడు PV రాజన్‌కు ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’లో జాక్‌పాట్ తగిలింది. అబుధాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్(రూ.61.37కోట్లు) వచ్చాయి. ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.


