News March 12, 2025
సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం: KCR

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.
Similar News
News March 12, 2025
సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విచారణకు రావాలని ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా పోర్ట్ వాటాలు బదిలీ చేయించుకున్నారని VSRపై కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
News March 12, 2025
సంక్షేమం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్

TG: రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో అన్నారు. ‘రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. సంక్షేమం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం’ అని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పథకాలేవీ పూర్తిగా అమలు కావడంలేదని BRS MLAలు నినాదాలు చేశారు.
News March 12, 2025
పాపం ‘పాప’

AP: కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిపై రాజమండ్రి 3టౌన్ PSలో పోక్సో కేసు నమోదైంది. 8వ తరగతి చదువుతున్న బాలిక(15) మంగళవారం డల్‌గా ఉండటంతో టీచర్ ఓదార్చుతూ ఏమైందని అడిగారు. దీంతో తండ్రి రాక్షసకాండను ఆమె బయటపెట్టారు. కాగా, విభేదాలతో బాధితురాలి తండ్రి వద్ద నుంచి తల్లి తన ముగ్గురు కుమార్తెలతో 8ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. 3ఏళ్లుగా పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉంటుండగా ఈ అఘాయిత్యం జరిగింది.