News September 14, 2025
ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.
Similar News
News February 6, 2026
ప్రకాశం జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు,మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 16. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 6, 2026
ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

* అబద్ధాలు కాదు.. చేసింది చెబితే చాలు: CM రేవంత్
* రైతు భరోసా ఇప్పుడే వేయాలి: KTR
* TGలో ఏప్రిల్-మేలో SIR నోటిఫికేషన్: CEO
* YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్
* ‘ఎనర్జీ’లో రూ.7.5లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్
* అతనిలో అహంకారం పెరిగిపోయింది.. రాహుల్‌పై మోదీ ఫైర్
* ప్రశ్నిస్తే అంత భయమా: రాహుల్ గాంధీ
* బొగ్గు గనిలో పేలుడు.. 16 మంది మృతి
News February 6, 2026
నాలుగు సీజన్లు.. ఇద్దరే విజేతలు

WPLలో ముంబై, ఆర్సీబీ జట్లదే డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 4 సీజన్లలో ఈ రెండు జట్లే రెండేసి సార్లు విజేతలుగా నిలిచాయి. హర్మన్, స్మృతి సేనలు డామినేషన్‌తో ఇతర జట్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. 2023, 2025లో ముంబై, 2024, 2026లో RCB విజేతలుగా నిలిచాయి. అటు ఢిల్లీ 4 సార్లు ఫైనల్ చేరిన టైటిల్‌ను గెలవలేకపోయింది. గుజరాత్ జెయింట్స్, యూపీకి ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది.


