News July 5, 2024

ఆస్పత్రుల మ్యాపింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం

image

TG: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య, ఆరోగ్య శాఖ మ్యాపింగ్ చేయనుంది. ప్రతి 30కి.మీ పరిధిలో ఎమర్జెన్సీ సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి ఉండేలా చర్యలు చేపట్టింది. అత్యవసర వైద్య సేవలు పొందడంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇటీవల ప్రాథమికంగా గుర్తించింది. ఏ గ్రామానికి ఏ వైద్య వసతి ఎంత దూరంలో ఉందో గుర్తించడంతో పాటు ఆసుపత్రిలో వసతులను మ్యాపింగ్‌లో రికార్డు చేస్తోంది.

Similar News

News November 17, 2025

కిచెన్ టిప్స్

image

* కొత్తిమీర వాడిపోతే వేర్లు కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో కాడలు మునిగేలా ఉంచాలి. అరగంట తర్వాత కొత్తిమీర తాజాగా మారుతుంది.
* ఎంత నీరు తాగినా దాహం తీరకపోతే ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని నమలి నీళ్లు తాగాలి. * గసగసాలు రుబ్బేముందు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతాయి. * ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.

News November 17, 2025

వారానికి 72 గంటల పనితోనే దేశాభివృద్ధి: మూర్తి

image

వారానికి 72గంటలు పనిచేయాలన్న గత వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు. కానీ దీనికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలి. చైనాలో వారానికి 72 గంటల (9AM-9PM-6 రోజులు) రూల్ ఉంది. దేశ పని సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ’ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

News November 17, 2025

తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.