News November 23, 2024

రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం మాదే: BJP నేత ధీమా

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో NDA కూటమే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని BJP అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుల, విభజన రాజకీయాలను రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఏక్ హై తో సేఫ్ హై’ నినాదాన్ని వారు అనుసరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో లడ్కీ బెహనా, ఝార్ఖండ్‌లో అక్రమ వలసలు తీవ్ర ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.

News November 16, 2025

‘ఇలా దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి’

image

రావి ఆకుపై ప్రమిదను ఉంచి, అందులో నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే.. పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజిస్తే శాపాలు, దోషాలు, గత జన్మ కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలగడానికి ఈ దీపం పెట్టాలి’ అని సూచిస్తున్నారు.

News November 16, 2025

MSTC లిమిటెడ్‌లో 37 ఉద్యోగాలు

image

<>MSTC<<>> లిమిటెడ్‌ 37 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, LLB, LLM, CA, CMA, MBA అర్హతగల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. CBT, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఎంపికైనవారికి నెలకు రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.mstcindia.co.in/