News August 27, 2025
ఒలింపిక్స్ నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తి.. రేపు కీలక సమావేశం

ఒలింపిక్స్-2036 నిర్వహణకు TG ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. బిడ్ వేయడానికి గల అవకాశాలపై చర్చించేందుకు రేపు స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశం కానుంది. దీనికి CM రేవంత్ రెడ్డి సహా కపిల్‌దేవ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, అభినవ్ బింద్రా, ఉపాసన, కావ్యా మారన్, సంజీవ్ గొయెంకా తదితరులు హాజరుకానున్నారు. స్పోర్ట్స్ అకాడమీలు, స్టేడియాల ఆధునికీకరణ, క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనపైనా చర్చించనున్నారు.
Similar News
News August 27, 2025
రష్యాతో ఎనర్జీ డీల్స్‌పై చర్చించిన US?

ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం ఈనెల 16న పుతిన్, ట్రంప్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఎనర్జీ డీల్స్‌పై చర్చ జరిగినట్లు Reuters తాజాగా వెల్లడించింది. యుద్ధం ఆపేందుకు ఆంక్షలు ఎత్తివేస్తామని, పెట్టుబడులకు అనుమతిస్తామని రష్యాకు US ఆఫరిచ్చినట్లు పేర్కొంది. త్వరలో US టాప్ ఆయిల్ కంపెనీ Exxon Mobil రష్యాలో రీఎంట్రీ ఇవ్వొచ్చంది. ఇరు దేశాలు ట్రేడింగ్ కూడా రీస్టార్ట్ చేయొచ్చని తెలిపింది.
News August 27, 2025
TCS కొత్త ఆఫీస్ అద్దె రూ.2,130 కోట్లు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బెంగళూరులో కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఇందుకు బెంగళూరులోని 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయానికి 15 ఏళ్లకుగానూ రూ.2,130 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.9.31 కోట్ల అద్దెతో రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ప్రతి మూడేళ్లకూ 12 శాతం అద్దె పెంపు ఉండనుంది.
News August 27, 2025
భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వాగులు, కాజ్‌వేలు, కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.