News September 21, 2025
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్

TG: కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ‘ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తా. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.
Similar News
News September 21, 2025
శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా: TDP

AP: జగన్ హయాంలో పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు? అని వైసీపీ నేతలను TDP ప్రశ్నించింది. ‘దొంగతనం చేసిన వాడిని శిక్షించకుండా, రాజీ ఎందుకు కుదిర్చారు? దొరికిన దొంగకు చెందిన ఆస్తులు, ఎవరి పేరున రిజిస్టర్ చేయించారు? చిన్న దొంగలు, పెద్ద దొంగలు కలిసి శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా? హైకోర్టు తీర్పుతో జగన్ హయాంలో జరిగిన పాపం పండింది’ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
News September 21, 2025
పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులు

<
News September 21, 2025
మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్‌తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.