News June 12, 2024
పెన్షనర్లకు ప్రభుత్వం GOOD NEWS
తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్ దారులకు, కుటుంబ పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
*70 నుంచి 75 ఏళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్ పై 15%
*75-80 ఏళ్ల లోపు వారికి 20%
*80-85 ఏళ్ల లోపు వారికి 30%
*90-95 ఏళ్ల లోపు వారికి 50%
*95-100 ఏళ్ల లోపు వారికి 60%
*100 ఏళ్లు పైబడిన వారికి 100% అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.
Similar News
News December 23, 2024
అతిగా నీరు తాగి ICUలో చేరిన మహిళ
‘అతి’ అనర్థాలకు దారి తీస్తుందట. ఓ మహిళ విషయంలోనూ అదే జరిగింది. నిద్ర లేవగానే 4 లీటర్ల నీరు తాగిన ఓ 40ఏళ్ల మహిళ కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలైంది. నీరు తాగిన గంటలోనే హైపోనాట్రేమియా(రక్తంలో సోడియం గాఢత తగ్గడం)తో ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు వచ్చాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆమె స్పృహ కోల్పోగా ICUలో చికిత్స పొందారు. రోజుకు 2.5-3.5 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచించారు.
News December 23, 2024
‘దేవర-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభం?
‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభమైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
News December 23, 2024
MS ధోనీ క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!
స్టైలిష్‌గా పొడవాటి జుట్టుతో MS ధోనీ 2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌పై మ్యాచుతో అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో ‘0’కే రనౌట్ అయినా, ఆపై అంచెలంచెలుగా ఎదిగి IND మేటి కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2007 T20WC, 2011 వన్డే WC, 2013లో CT సాధించారు. అలాగే IPLలోనూ CSKకు 5 ట్రోఫీలు అందించారు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా IPL ఆడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.