News December 5, 2024
దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.
Similar News
News April 10, 2026
పెద్దపల్లి: హాల్ టికెట్లు విడుదల: డీఈవో

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్.ఎస్.సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.శారద శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్ లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా హాల్ టికెట్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 10, 2026
యుద్ధం.. శాంతి చర్చలకు పాక్ బయల్దేరిన జేడీ వాన్స్

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు కాసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు బయల్దేరారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చర్చల ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 2 రోజులు లాక్‌డౌన్ విధించారు.
News April 10, 2026
ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్.. కేంద్రం చర్యలు!

గ్యాస్ కొరత కారణంగా దేశంలో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో 40% డిమాండ్ పెరగొచ్చని, అందుకు అదనంగా 27GW విద్యుత్ అవసరం పడుతుందని భావిస్తోంది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఇండక్షన్ స్టవ్ కంపెనీలతో చర్చిస్తోంది. అలాగే విద్యుదుత్పత్తి విషయంలోనూ చర్యలకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడటంతో ప్రజలు భారీగా ఇండక్షన్ స్టవ్‌లు కొంటున్నారు.


