News December 16, 2024

అప్పులపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: BRS

image

TG: అప్పులపై అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను ఆర్థికమంత్రి తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై BRS సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతించాలని స్పీకర్‌ను కోరినట్లు KTR తెలిపారు. రాష్ట్ర అప్పు రూ.3.90 లక్షల కోట్లు ఉందని RBI చెబితే ప్రభుత్వం రూ.6.90 లక్షల కోట్లు అని చెబుతోందని ఆయన మండిపడ్డారు.

Similar News

News January 18, 2026

జగిత్యాల: ఐదు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

image

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను శనివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఖరారు చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించి, మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

News January 18, 2026

మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

image

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్‌, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

News January 18, 2026

రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

image

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.