News April 6, 2024
జూన్ 4 లోపే రూ.20వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధం: యనమల

AP: ఈ ఆర్థిక సంవత్సరం రెండో రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పు తెచ్చిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రోజుకు రూ.257 కోట్ల చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 2024-25కు కేటాయించిన కోటాలో రూ.20వేల కోట్ల అప్పును ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4 లోపే తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు.
Similar News
News January 30, 2026
22,000 జాబ్స్.. రేపటి నుంచే అప్లికేషన్లు

RRB నోటిఫికేషన్ జారీ చేసిన 22వేల గ్రూప్-డి ఉద్యోగాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 2 వరకు అవకాశం ఉంటుంది. పాయింట్స్మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలకు పదో తరగతి, ఐటీఐ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 1-1-2026 నాటికి 18 నుంచి 33 మధ్య ఉండాలి. స్టార్టింగ్ శాలరీ నెలకు రూ.18వేలు.
వెబ్సైట్: <
News January 30, 2026
ఆలయాలు ఎక్కువగా కొండలపై ఎందుకు?

కొండ ఎక్కడం అనేది మనిషి తనలోని అహంకారం, కోరికలు అనే బరువులను వదిలి, నిర్మలమైన మనసుతో దైవాన్ని చేరుకోవడం. భౌతికంగా కొండలపై స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండి, భగవంతుని ధ్యానానికి అనువుగా ఉంటుంది. అలాగే పూర్వకాలంలో దండయాత్రల నుంచి ఆలయాలను రక్షించుకోవడానికి, జనసంచారానికి దూరంగా ప్రశాంతతను పొందడానికి మన పెద్దలు కొండలపైనే ఆలయాలను నిర్మించారు. పర్వతాలను ఆలయాలుగా కొలిచే గొప్ప సంస్కృతి మనది.
News January 30, 2026
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు

<


