News October 13, 2024
ప్రభుత్వానిదే బాధ్యత.. సిద్దిఖీ హత్యపై రాహుల్

MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ హత్య ఘటన MHలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిఖీ హత్య బాలీవుడ్ చిత్రసీమలోనూ తీవ్ర విషాదం మిగిల్చింది.
Similar News
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోవడం, వికారం ఉంటాయి. ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితాలు ‘పాజిటివ్’ అని వస్తాయి. రక్తస్రావం కావడం, పొత్తికడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్లలో, లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంటుంది.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులు.. 6541 ఉద్యోగాలు

AP: రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ <<18408811>>కార్యాలయాలు<<>> ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకోసం రూ.1,328 కోట్లు వెచ్చించనుండగా 6,541 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థల జాబితా ఇదే.. APGB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOB, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
News November 28, 2025
రోజుకు 30-35 లీటర్ల పాలు.. ఈ ఆవులతో డెయిరీఫామ్ మేలు

ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతుల్లో హోలిస్టిన్ ఫ్రీజియన్ ఒకటి. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఒక ఈతలో 9వేల లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇవి రోజుకు కనీసం 25-30 లీటర్లు, కొన్ని సందర్భాల్లో 35-40 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కొవ్వు 3.5%గా, ప్రొటీన్ 3.1%గా ఉంటుంది. ఈ రకం ఆవులతో డెయిరీఫామ్ నిర్వహణ మేలంటున్నారు వెటర్నరీ నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.


