News August 16, 2024

LRS క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు జారీ

image

TG: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అనుమతి లేని, చట్టవిరుద్ధమైన లే ఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లే ఔట్లకు మాత్రమే LRS వర్తిస్తుందని తెలిపింది. అదే ఏడాది అక్టోబర్ 15లోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

Similar News

News November 18, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

News November 18, 2025

బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

image

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్‌ను అభినందించారు.

News November 18, 2025

సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

image

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>