News November 28, 2024
వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News November 27, 2025
VKB: ఈ గ్రామంలో ఒకే ఇంటికే పల్లె పగ్గాలు!

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్లో పంచాయతీ రిజర్వేషన్లు ఓ కుటుంబానికే వరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ (ఎస్టీ జనరల్)తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో ఉన్న ఒక్క ఎస్టీ కుటుంబం ఎరుకలి భీమప్ప కుటుంబం మొత్తం పోటీ రంగంలో నిలబోనుంది. గ్రామంలో 494 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, ఎస్టీ వర్గానికి చెందిన భీమప్ప కుటుంబం ఒక్కటే ఉండటంతో మూడు స్థానాలకు అదే ఇంటి నుంచే అభ్యర్థులు రావడం ఖాయం.
News November 27, 2025
హీరోయిన్ కూడా మారారా!

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.
News November 27, 2025
స్వెటర్లు ధరిస్తున్నారా?

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.


