News January 17, 2025

పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు. ‘వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. BPL ఫ్యామిలీ అయి ఉండాలి. కచ్చితంగా ఆధార్ ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

image

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 14, 2025

పట్టుచీర కట్టిన తర్వాత..

image

ప్రతీ పండుగకు ఒక పట్టుచీర తీసి కడుతుంటారు మగువలు. అయితే వీటిని ప్రతిసారీ వాష్ చేస్తే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. * కొత్త చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేయ్యాలి. * చాలామంది కొత్త చీరలను డిటర్జెంట్, షాంపూలతో వాష్ చేస్తారు. అప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని వాడాలి. * చీరలను కలిపి ఉతికేటపుడు వేటికవే విడిగా ఉతకాలి. లేదంటే రంగులు అంటుకోవచ్చు.

News October 14, 2025

IPS ఆత్మహత్య.. డీజీపీకి ‘సెలవు’

image

హరియాణాలో తెలుగు IPS పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న DGP శత్రుజిత్ కపూర్‌ను ప్రభుత్వం ‘బలవంతపు సెలవు’పై పంపింది. రోహ్‌తక్ SP నరేంద్ర బిజార్నియాపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఉన్నతాధికారుల కులవివక్ష వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పూరన్ భార్య, IAS అమ్నీత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.