News November 24, 2024
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్
AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యార్థులపై చంద్రబాబు కక్షగట్టారని ఆయన విమర్శించారు. ‘అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడును బాబు రద్దు చేశాడు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలకే వసతి, విద్యా దీవెన జమ చేసేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 24, 2024
STAY TUNED: IPL వేలం ప్రారంభం
సౌదీలోని జెడ్డాలో IPL వేలం ప్రారంభమైంది. తమ అభిమాన క్రికెటర్ ఏ టీమ్లోకి వెళతాడు? ఎన్ని రూ.కోట్లు కొల్లగొడతాడు? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఆక్షన్లో మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. StarSports ఛానల్, JioCinemaలో LIVE ప్రారంభమైంది. రేపు కూడా వేలం కొనసాగనుంది.
News November 24, 2024
మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ
AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.
News November 24, 2024
పట్టు బిగించిన భారత్.. ఆసీస్ 12/3
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.