News March 13, 2025
HMDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 3వేల చ.కి.మీ భూభాగం చేర్చుతున్నట్లు పేర్కొంది. దీంతో మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం HMDA పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.
Similar News
News November 25, 2025
కామారెడ్డి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ సంయుక్త సమీక్ష

కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం కీలక విభాగాలపై సమీక్ష సమావేశం జరిగింది. పౌర హక్కుల రక్షణ చట్టం-1955, SC/ST అట్రాసిటీ చట్టాల అమలు, పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులు వివరాలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేకంగా చర్చ జరగగా, అవగాహన కార్యక్రమాలు, సంయుక్త దళాల తనిఖీలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.