News June 11, 2024

సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: రాష్ట్రంలో సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులై, ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు పత్రాలు <>వెబ్‌సైట్<<>> నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని సీఎస్ తెలిపారు.

Similar News

News November 21, 2025

అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

image

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్‌లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.

News November 21, 2025

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.

News November 21, 2025

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ 4 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MA (ELS/ELT/ఇంగ్లిష్), PhD, M.Phil ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించి ఉండాలి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/