News February 17, 2025
విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలు.. ప్రభుత్వం ఉత్తర్వులు

AP: GOVT స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్‌కు ₹200, ఇతర రాష్ట్రాలకు ₹2K చొప్పున ఖర్చు చేస్తామంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.
Similar News
News January 20, 2026
సభలో కూర్చున్నప్పుడే MPల అటెండెన్స్: స్పీకర్

లోక్‌సభ సభ్యుల అటెండెన్సును వారు సభలో కూర్చున్నప్పుడే తీసుకోనున్నామని స్పీకర్ ఓం బిర్లా మీడియాకు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు హౌస్ బయట హాజరు వేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సభ ముగిసిన, ఏదైనా కారణంతో అర్థాంతరంగా వాయిదా పడిన తర్వాత హాజరు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హాజరు నమోదుకు సభ్యుల సీట్ల వద్ద కన్సోల్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News January 20, 2026
ఫైర్ సేఫ్టీ సంస్థలకు లైసెన్స్‌ల జారీకి కఠిన నిబంధనలు

TG: థర్డ్ పార్టీ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఆడిటర్లు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంటిగ్రేటర్లకు లైసెన్స్‌ల జారీ రూల్స్‌ను ప్రభుత్వం కఠినం చేసింది. ఈమేరకు GO జారీ చేసింది. వీరికి ఉండాల్సిన అర్హతలనూ నిర్దేశించింది. ఫైర్ సేఫ్టీ రూల్స్‌ను వివరిస్తూ అవి కచ్చితంగా అమలు కావలసిందేనని స్పష్టం చేసింది. బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల జారీలో రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.
News January 20, 2026
WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 154/5 రన్స్ చేసింది. సీవర్ బ్రంట్ 45 బంతుల్లో 65* పరుగులతో అదరగొట్టారు. ఓపెనర్ హర్మన్ ప్రీత్ 41 రన్స్ చేశారు. మిగతావారెవరూ రాణించకపోవడంతో MI భారీ స్కోర్ చేయలేకపోయింది. DC బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి 3 వికెట్లతో సత్తా చాటారు. DC టార్గెట్ 155 రన్స్.


