News July 24, 2024
స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు

AP: 1-10వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. AUG 1 నుంచి 5 వరకు ఫార్మెటివ్-1 పరీక్షలు, SEP 26-30 వరకు ఫార్మెటివ్-2, NOV 1-15 వరకు సమ్మెటివ్-1, JAN 2-6 వరకు ఫార్మెటివ్-3 నిర్వహించాలని స్కూళ్లను ఆదేశించింది. టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 10-20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు ఉంటాయి. ఫార్మెటివ్-4 మార్చి 3-6 వరకు, సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7-18 వరకు నిర్వహిస్తారు.
Similar News
News January 23, 2026
AP SETకు అప్లై చేశారా?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET-2025)కు అప్లై చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు పోటీ పడేందుకు సెట్ అర్హత తప్పనిసరి. పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: www.apset.net.in
News January 23, 2026
మున్సిపల్ పోరుకు ముహూర్తం: 28న ఎన్నికల షెడ్యూల్?

TG: మున్సిపల్ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు SEC సిద్ధమైంది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 27న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. మరుసటి రోజే అంటే జనవరి 28న ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
News January 23, 2026
సిట్ విచారణకు వెళ్లే ముందు KTR ప్రెస్ మీట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, BRS కీలక నేత KTR నేడు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. అంతకుముందు 9:30 గంటలకు ఆయన తెలంగాణ భవన్కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతలతో సమావేశం అనంతరం 10 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఇదే కేసులో మరో కీలక నేత హరీశ్రావును ఇటీవలే సిట్ విచారించిన విషయం తెలిసిందే.


