News January 17, 2025

IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం

image

AP: సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు స్పెషల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై వీరు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు.

Similar News

News February 10, 2026

ఫిబ్రవరి 10: చరిత్రలో ఈరోజు

image

☛ 1921: ఇండియా గేట్‌కు శంకుస్థాపన
☛ 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం
☛ 1985: సినీ గాయని ప్రియా హిమేశ్ జననం
☛ 1990: సింగర్ రేవంత్ జననం
☛ 1993: స్వాతంత్ర్య సమరయోధుడు గయా ప్రసాద్ కటియార్ మరణం (ఫొటోలో)
☛ 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు KN.రాజ్ మరణం
☛ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

News February 10, 2026

హైదరాబాద్‌లో విజయ్-రష్మిక రిసెప్షన్?

image

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత బలం చేకూరుస్తూ మార్చి 4న వీరి రిసెప్షన్ HYDలోనే జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరవుతారని పేర్కొన్నాయి. పెళ్లి రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. అయితే పెళ్లిపై రష్మిక-విజయ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Photo: AI

News February 10, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.