News September 23, 2024
వరద పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు

AP: వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పంట నష్టంపైనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఎల్లుండి నుంచి పరిహారం బాధితులకు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 21, 2026
వీటిని క్లీన్ చేస్తున్నారా?

మేకప్ బ్రష్లు, స్పాంజ్లకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్ టూల్స్ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.
News January 21, 2026
హైదరాబాద్లోని NIRDPRలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 4 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ(బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ సైన్సెస్/ డెవలప్మెంట్ ఎకనామిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ మేనేజ్మెంట్/సోషల్ వర్క్), B.Tech, M.Tech/MCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్సైట్: http://career.nirdpr.in//
News January 21, 2026
ప్చ్.. మాఘ మాసం వచ్చినా!

పెళ్లిళ్లతో కళకళలాడే మాఘమాసం ఈసారి ముహూర్తాలు లేక వెలవెలబోతోంది. గతేడాది NOV 26 నుంచి FEB 17(2026) వరకు మూఢం ఉండటమే ఇందుకు కారణం. శాస్త్రాల ప్రకారం మూఢంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. అందుకే ఈ ఏడాది మాఘమాసం మొత్తం పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తిరిగి FEB 19 (ఫాల్గుణ మాసం) తర్వాతే కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లి కావాల్సిన యువతీయువకులు ఉగాది వరకు వేచి చూడక తప్పదని జ్యోతిషులు వివరిస్తున్నారు.


